‘అల్లూరి’ గా వస్తున్న శ్రీవిష్ణు..!

Sree Vishnu New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Movie Updates,Sree Vishnu Latest Movie News,Sree Vishnu new Movie,Sree Vishnu Upcoming Movie,Sree Vishnu New Cop Movie Alluri, Sree Vishnu New Movie Titled Alluri,Alluri Movie Updates,Alluri New Movie,Sree Vishnu As a Cop in New Movie Titled Alluri,Sree Vishnu To Play Cop Role in Alluri

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను తీయడానికే శ్రీవిష్ణు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపయాలతో పనిలేకుండా ప్రస్తుతం అయితే కెరీర్ లో ఎలాంటి ఢోకా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘గాలి సంప‌త్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ అనే సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ”భళా తందనాన” అనే సినిమాను చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు ఒక సినిమా చేస్తున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ను అలానే ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు అల్లూరి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా శ్రీ విష్ణు కనిపించనున్నట్టు తెలుస్తుంది.

కాగా యాక్షన్ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు హ‌ర్షవ‌ర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 18 =