దక్షిణాది భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం “”పుష్ప :ది రూల్ “, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “పుష్ప :ది రైజ్ ” హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టి-సిరీస్ , సినీ 1 స్టూడియోస్ , భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్ “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా క్రైమ్ డ్రామా “యానిమల్ “హిందీ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రణ్ బీర్ కు జోడీగా రష్మిక ఎంపిక అయినట్టు ఉగాది పండగ సందర్భంగా దర్శకుడు సందీప్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న “యానిమల్ ” మూవీ లో అనిల్ కపూర్ , బాబీ డియోల్ ముఖ్య పాత్రలలో నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































