వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కళావతి కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు హోలీ సందర్భంగా తన ఫ్యాన్స్, తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలనీ , ఈ రోజు ప్రేమ, ఆనందం మరియు చైతన్యంతో నిండి ఉంటుందని భావిస్తున్నాననీ , కానీ సురక్షితంగా అంటూమహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇందుకు ఫ్యాన్స్ కూడా మహేష్ బాబుకు హోలీ విషెస్ తెలుపుతున్నారు. మార్చి 20న “సర్కారు వారి పాట” నుంచి సెకండ్ సింగిల్ రానున్నందున ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: