స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR 30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా తిరుమలకు వెళ్లారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి, తల్లి షాలిని, తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు వీరికి ఘనస్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి క్యూట్ లుక్స్ ఎన్టీఆర్ అభిమానులని, విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























