ఎస్ కె ఎన్ , దర్శకుడు మారుతి నిర్మాతలుగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి రాజేష్ దర్శకత్వంలో యువ హీరో ఆనంద్ దేవరకొండ , బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. “మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న“బేబీ” మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. విరాజ్ అశ్విన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు హీరో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా “బేబీ” మూవీ కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కొత్త పోస్టర్ లో వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ పాటు హీరో ఆనంద్ దేవరకొండ “హైవే” మూవీ లో కూడా నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























