అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జాతి రత్నాలు. కామెడీ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీంతో చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిజానికి ఈసినిమా రిలీజ్ సమయంలో కరోనా ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లు కూడా అప్పుడప్పుడే తెరిచిన సందర్భాలు.. ప్రేక్షకులు కూడా బయటకు రావడానికి భయపడుతున్న రోజులు అయినా కూడా మేకర్స్ ధైర్యంగా ఈసినిమాను రిలీజ్ చేశారు. వారి నమ్మకానికి తగ్గట్టే.. ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయి ఏడాది అవ్వడంతో నవీన్ పోలిశెట్టి దీనిపై తన ట్విట్టర్ ద్వారా స్పందించి ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఇంకా పలు నగరాల్లో ఈసినిమాకు వచ్చిన రెస్పాన్స్ కు సంబంధించిన గ్లింప్స్ కూడా పోస్ట్ చేసి.. ముందు ముందు ఇంకా హార్డ్ వర్క్ చేస్తానని.. ఇలానే ఎంటర్ టైన్ చేస్తానంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
1 year since blockbuster #JathiRatnalu today. No vaccination back then. Theatres were shutting down. This video is a glimpse of what we saw. Euphoria, mass hysteria, endless laughter. All thanks to u guys. MY family. I will work very hard to entertain & give back the same love ❤️ pic.twitter.com/M133kq1cdQ
— Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2022
కాగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా.. మురళీ శర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈసినిమా కు రాధన్ సంగీతం అందించాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























