కరోనా థర్డ్ వేవ్ తరువాత సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో చాలా సినిమాలకు పోటీ తప్పట్లేదు. నిజానికి సంక్రాంతికి చాలా సినిమాలు పోటీకి సిద్దపడినా ఆ తరువాత ఆ బరి నుండి తప్పుకున్నాయి. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో మళ్లీ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే చాలా జాగ్రత్తగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నా రిలీజ్ క్లాష్ లు తప్పడం లేదు. ఈ ఫిబ్రవరి 25నే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరికి దిగాయి. గని, భీమ్లానాయక్ తో పాటు ఇంకా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు కె.జి.యఫ్ 2, హిందీ జెర్సీ సినిమాకు మధ్య కూడా పోటీ తప్పడంలేదు. కె.జి.యఫ్ 2 సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమాకు పోటీగా ఇప్పటి వరకూ లాల్ సింగ్ చద్దా సినిమా ఉండేది. అయితే ఏప్రిల్ 14 నుండి ఆ సినిమా తప్పుకొని ఆగష్ట్ 11న కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో జెర్సీ మూవీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు జెర్సీ, కె.జి.యఫ్ 2 సినిమాల మధ్య పోటీ మొదలైంది. మరి కె.జి.యఫ్ 2 అయితే ఇప్పటివరకూ రిలీజ్ డేట్ ను మార్చలేదు. మరి ఈ గ్యాప్ లో ఏమన్నా మార్చే ఛాన్స్ ఉందో.. లేదో.. లేక అదే డేట్ లో వస్తుందో చూడాలి..
కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో షాహిద్ కు జోడీగా మృణాళిని ఠాకూర్ నటిస్తుంది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ, శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి తెలుగులో సూపర్ హిట్ అయిన ఈసినిమాను హిందీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: