ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం ఒక ఎత్తైతే అది ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది అనేది మరో టాస్క్. కానీ అన్ని పరిశ్రమలతో పోల్చుకుంటే మన టాలీవుడ్ సక్సెస్ రేటు చాలా బెటర్ అనిపిస్తుంది. మన సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాయి. ఇక మన తెలుగు ప్రేక్షకులకు కథ నచ్చితే పెద్ద సినిమాను ఎలా ఆదరిస్తారో.. చిన్న సినిమాలను కూడా అలానే ఆదరిస్తారన్న విషయం మరోసారి రుజువు చేశారు డీజే టిల్లు సినిమా విషయంలో. ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సందర్భాలు ఉండగా తాజాగా ఆ లిస్ట్ లో డీజే టిల్లు కూడా చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సిద్దూ జొన్నల గడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని హిట్ ఖాతాలోకి చేరిపోయింది ఈసినిమా. ఈసినిమాకు విమల్ కృష్ణ డైరెక్టర్ అయినా కూడా సిద్దూ హీరోగా చేస్తూనే ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. సిద్దూ బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగినట్టు డ్రస్ కోడ్, యాటిట్యూడ్, అవసరమైన చోట అమాయకత్వం, చలాకీతనం టిల్లు పాత్రను పర్‌ఫెక్ట్‌గా మార్చాయి. అందుకే ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయ్యారు.
అయితే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఓ విషయంలో మాత్రం భయపడ్డాను అంటున్నాడు సిద్దూ. అదేంటంటే.. ఈసినిమాలో సిద్దూ తెలంగాణ కుర్రాడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏపీలో విజయవాడ థియేటర్ లో తను మాట్లాడుతూ.. ఈసినిమా నైజాం ఆడియన్స్ కు ఎక్కుతుంది.. అక్కడ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అని తెలుసు.. కానీ ఏపీ విషయంలోనే భయమేసింది. కానీ ఇక్కడ ఆడియన్స్ కూడా ఈసినిమాను రిసీవ్ చేసుకున్న విధానం చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంటే.. చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ తో సంతోషంలో ఉన్నారు.
కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా..ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























