కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియాఅనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ ను చూస్తే ఈసినిమాలో మోహన్ బాబు ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ట్రైలర్లో మోహన్ బాబు వివిధ గెటప్‌లలో కనిపించారు. ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే మొదలవుతోంది అంటూ మోహన్ బాబు వాయిస్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. ప్రపంచం అంతా నా కుటుంబం. ప్రపంచం బాధ నా బాధ. అంటూ.. స్వామి.. ధర్మ సంస్థాపనార్ధయా .. సంభవామి.. యుగే యుగే అంటూ మహా భారతంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన దాన్నే ఫాలో అవుతాను.. మన దేశంలో డబ్బున్నోడికి న్యాయం.. డబ్బు లేనోడికో న్యాయం.. పవర్ ఉన్నోడికో న్యాయం.. లేనోడికో న్యాయం అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
Here’s the Electrifying #SonofIndiaTrailer🇮🇳
🎶Maestro #Ilaiyaraaja Musical🎵 on @adityamusic
Directed by @ratnababuwriter and Produced by @iVishnuManchu@24framesfactory #SLPP #SonofIndiaFromFeb18th🔥— Mohan Babu M (@themohanbabu) February 10, 2022
ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. ఇళయరాజా సంగీత అందిస్తుండగా.. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: