రెండు రిలీజ్ డేట్లపై కౌంటర్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ డైరెక్టర్ రీకౌంటర్

Ramarao on Duty Director Gives Clarity about Two release dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ramarao on Duty,Ramarao on Duty Movie Updates,Ramarao on Duty Latest News,Ramarao on Duty Upcoming Movie,Ramarao on Duty Latest Movie Updates,Ramarao on Duty Clarity About Release Date, Ramarao on Duty two Release Dates,Ramarao on Duty Direector Gives Clarity About Release Dates,Ravi Teja Ramarao on Duty Movie Updates,Ravi Teja Ramarao on Duty Movie Update on Release Date, Ravi Teja Ramarao on Duty Movie Latest Updates,Ramarao on Duty March 25th or April 11th,Ramarao on Duty March 25th,Ramarao on Duty April 11th,Divyansha Kaushik In Ramrao On Duty, Divyansha Kaushik with Ravi teja,Rajisha Vijayan In Ramrao On Duty,Rajisha Vijayan with Ravi teja,Mass Maha Raja Ravi teja,#ramraoonduty

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే సినీ పరిశ్రమలో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. అయితే ఈనెల నుండి మళ్లీ వాయిదా పడిన సినిమాల తేదీలను మళ్లీ చిత్ర యూనిట్లు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకొని విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు ఒక్క డేట్ నే ఫిక్స్ చేసుకుంటే.. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక కొన్ని సినిమాలు మాత్రం రెండు తేదీలను ప్రకటిస్తున్నారు. అందులో భీమ్లానాయక్, గని, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ముందు ముందు ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా డైరెక్టర్ శరత్ మండవ దీనిపై స్పందించి రెండు రిలీజ్ డేట్లను ఎందుకు ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చిందో చెబుతున్నాడు. తాజాగా తెలుగు సినిమాలు రెండు రిలీజ్ డేట్లను ఎంపిక చేసుకోవడంతో కొంతమంది బాలీవుడ్, కోలీవుడ్ క్రిటిక్స్ విమర్శిస్తున్న నేపథ్యంలో దీనిపై శరత్ మండవ మాట్లాడుతూ.. ఛాయిస్ లేదు అందుకే రెండు రిలీజ్ డేట్లు.. పాండమిక్ ఉన్నా.. అనేక ప్రెషర్స్ ఉన్నా.. మేము సినిమాకోసం రాత్రింబవళ్లు చాలా కష్టపడుతున్నాం అంటూ సమాధానమిచ్చాడు. దీంతో శరత్ ఇచ్చిన కౌంటర్ ను పలువురు అభినందిస్తున్నారు.

కాగా శరత్‌ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ తుది దశకు చేరుకున్న ఈ సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్‌ 15న విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.