టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వచ్చిందని తనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. ఇక తాజాగా మరోసారి తన హెల్త్ గురించి అప్ డేట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. తను ప్రస్తుతానికి బాగానే ఉన్నానని.. మళ్లీ టెస్ట్ చేస్తే పాజిటివ్ అనే వచ్చిందని.. నెగిటివ్ వచ్చేవరకూ క్వారంటైన్ లోనే ఉండాలి.. అయితే ప్రస్తుతానికి అయితే కోలుకుంటున్నాను.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నా అంటూ ఒక చిన్న వీడియో ద్వారా హెల్త్ అప్ డేట్ ఇచ్చాడు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#VishwakSen who was tested positive for #Covid19 recently, updated about his health through this video!!#Vishwak @VishwakSenActor #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/vqKHMrxd5I
— Telugu FilmNagar (@telugufilmnagar) January 3, 2022
ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే.. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో గామి సినిమా కూడా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: