మొన్నటి వరకూ కరోనా వల్ల సినిమా రిలీజ్ లకు ప్రాబ్లమ్ అయింది. దాని ప్రభావం తగ్గింది కదా అనుకుంటే ఇప్పుడు ఒమిక్రాన్ ఎఫెక్ట్ పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూలు ఏర్పాటు చేయడం .. థియేటర్లు కూడా మూసేయడం జరిగింది. దీంతో మరోసారి సినిమా రిలీజ్ లు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాలకు నిజంగా ఇది బ్యాడ్ లక్కే అని చెప్పొచ్చు. ఇక ఈ నెల 7న రిలీజ్ కావాల్సిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సైతం వెనక్కి తగ్గింది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో రాధేశ్యామ్ రిలీజ్ కూడా వాయిదా పడనుందనే న్యూస్ వైరల్ అయ్యింది. కానీ అవన్నీ రూమర్స్ అని, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు కన్ఫామ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరోసారి రిలీజ్ పై రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తాజాాగా రాధాకృష్ణ తన ట్విట్టర్ ద్వారా “సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి- టీమ్ రాధేశ్యామ్” అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఒక నెటిజన్ రీ ట్వీట్ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా సినిమా పోస్ట్ పోన్ అని చెబుతున్నావా అన్నా అని అడుగగా దానికి రాధాకృష్ణ అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అఫీషియల్ గా చెబుతాం అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Times are tough, hearts are weak, minds in mayhem. Whatever life may throw at us – Our hopes are always High. Stay safe, stay high – Team #radheshyam
— Radha Krishna Kumar (@director_radhaa) January 4, 2022
Alaantidemaina vunte direct ga official ga chepthaam 👍👍
— Radha Krishna Kumar (@director_radhaa) January 4, 2022
కాగా రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న ప్రేమకథ రాధేశ్యామ్. ఇంకా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సౌత్ లో ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందించనున్నాడు. ఇక హిందీ పాటలకి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: