తమిళ్ హీరో అజిత్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటినుండో ఆయన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూ వస్తూనే ఉన్నాయి. అందుకే ఇక్కడ కూడా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అజిత్ నుండి వాలిమై సినిమా వస్తుండగా.. ఈసినిమా కోసం ఎంతోమంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగులో ‘వాలిమై’ చిత్రాన్ని ‘బలం’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. హెచ్. వినోత్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను చూస్తుంటేనే అర్థమవుతుంది.. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లు కూాడా సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టే ఉంది. ఇక ఈమూవీలో అజిత్ కు స్ట్రాంగ్ విలన్ గా టాలీవుడ్ యంగ్ స్టార్ కార్తికేయ నటిస్తుండగా.. వీరిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది ట్రైలర్ ను చూస్తుంటే.
ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుండగా… కార్తికేయ విలన్గా చేస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. తెలుగులో రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: