“జానకి రాముడు “(1988) మూవీ తో టాలీవుడ్ కు రైటర్ గా పరిచయం అయిన కె వి విజయేంద్ర ప్రసాద్ “మగధీర “, విక్రమార్కుడు “, “బాహుబలి”, బాహుబలి 2″,”బజరంగీ భాయిజాన్ “, “మణికర్ణిక :ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ “(హిందీ ), “తలైవి “(తమిళ ) వంటి భారీ మూవీస్ కు రైటర్ గా వర్క్ చేశారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన “రాజన్న “మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకుంది. బెస్ట్ స్టోరీ రైటర్ గా “బజరంగీ భాయిజాన్ ” హిందీ మూవీ కి విజయేంద్ర ప్రసాద్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “మూవీ కి స్టోరీ అందించిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ “విక్రమార్కుడు “మూవీ హిందీ రీమేక్ “రౌడీ రాథోడ్” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “బజరంగీ భాయిజాన్ ” సీక్వెల్ “బజరంగీ భాయిజాన్2”, బ్లాక్ బస్టర్ “రౌడీ రాథోడ్” సీక్వెల్ “రౌడీ రాథోడ్2” మూవీస్ కు రైటర్ గా పనిచేస్తూ విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























