తమిళ స్టార్ ధనుష్ కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీ, ఇంకా ఇంగ్లీష్ లో కూడా సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తమిళ్ లో తను తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు ధనుష్. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులోనే స్ట్రెయిట్ సినిమాను తీయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల తో సినిమాను ప్రకటించాడు ధనుష్. తాజాగా మరొక స్ట్రెయిట్ తెలుగు సినిమాను అనౌన్స్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ తో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. తెలుగులో సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు ఈసినిమాకు సంబంధించిన పలు వివరాలను తెలియచేశారు.
An ambitious & heartwarming journey of a common man❤️
Presenting you @dhanushkraja in & as #Vaathi / #Sir 🤩
▶️ https://t.co/HEFmYFfCP2#SIRMovie @iamsamyuktha_ #VenkyAtluri @gvprakash @dineshkrishnanb @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts pic.twitter.com/zgW7ty0nqt
— Sithara Entertainments (@SitharaEnts) December 23, 2021
కాగా ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గాపనిచేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. వచ్చే ఏడాది నుండి ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























