మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. డివైడ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ రాబడుతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప: ది రైజ్”మూవీ కి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ , ఓవర్ సీస్ లలో అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2 రోజులలో 116 కోట్లు గ్రాస్ వసూళ్ళు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు రోజులలోనే “పుష్ప: ది రైజ్”మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అల్లు అర్జున్ ఒన్ మేన్ షో, సుకుమార్ టేకింగ్, రష్మిక గ్లామర్, దేవీశ్రీ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముందు ముందు
“పుష్ప: ది రైజ్”మూవీ మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































