హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ”చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అఖండ” సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ పంతులు పలు కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోయిన వారం తాను , తన స్వామివారి సేవక బృందంతో బోయపాటిగారి దర్శకత్వంలో నిర్మితమైన “అఖండ” సినిమా చూశాననీ , ఇవాల్టి రోజున ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారనీ , ధర్మాన్ని రక్షించడం కోసం మన అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందనీ , అహింసా ప్రథమో ధర్మః’ అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో ఈ సినిమాలో చూపించడం జరిగిందనీ , ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఏదైనా చేయవచ్చు ననీ , ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనీ , ఎందుకు ఇంతమంది ఈ సినిమాని చూస్తున్నారూ.. అంటే వారి మనసుల్లో ఉక్రోషం, ఆక్రోషం, తపన ఉందనీ , .ఏమీ చేయలేకపోతున్నామే అనే ఆందోళనకరమైనటువంటి కోపం ఉందనీ , రాజ్యాంగం ఉన్నా మన ధర్మానికి అన్యాయం జరుగుతుందనీ , రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామనీ , ఇది పాలకులు గుర్తించాలనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































