టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల జరిగిన రోడ్టు ప్రమాదంలో కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి కన్ను ముశారు. దీంతో వారి కుటుంబం విషాదంలో ఉండగా అందరూ సంతాపం తెలియచేస్తున్నారు. ఇక తన సోదరుడి మృతికి కిరణ్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశాడు. అందులో రేయ్.. కిరా.. మన ఊరికి రోడ్డు సరిగా లేదు.. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒకటి గట్టిగా సాధించాలిరా అని తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. నన్ను హీరోగా చూడటం కోసం తన లగ్జరీ ని సైతం పక్కకుపెట్టాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అనే టైమ్ కి తనే లేకుండా వెళ్లిపోయాడు. నన్నెప్పుడు పరిచయం చేస్తావురా అని అడిగేవాడు.. కానీ ఇలా పరిచయం చేయాల్సి వస్తుందని ఊహించలేదు. నేను ఇప్పుడు నా అన్నని ఎలా పరిచయం చేయాలి.. నా వెనుక ఉన్నది మా అన్న ”అబ్బవరం రామాంజులు రెడ్డి” అంటూ పరిచయం చేశాడు. రోడ్డు ప్రమాదం కారణంగా నా అన్న ప్రాణాలు కోల్పోయాడు.. ప్లీజ్ టేక్ కేర్.. మీ సంతోషం కోసం కష్టపడుతున్న వారు మీకు ఏదైనా జరిగితే భరించలేరు అని భావోద్వేగం అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే హీరోగా తనకంటూ ప్రత్యేకంగా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఎదగటానికి ప్రయత్నిస్తున్నాడు. ‘రాజావారు రాణిగారు’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. దీనితో పాటు మైత్రీ మూవీ మేకర్స్-క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























