బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న అఖండ మూడో సినిమా. మరి వీరిద్దరి కాంబినేషన్ కావడంతో మాములుగానే అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. బాలకృష్ణ డైలాగ్స్‌తోడు మేకోవర్ అదిరిపోయింది. దీంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అయితే మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా చాలా భారీగానే చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. డిసెంబర్ 27న శిల్ప కళా వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో మరింత బజ్ పెరిగింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
Its going to be a 💥 𝐌𝐀𝐒𝐒ive Explosion Event 💣
🔥 Icon Star @alluarjun a.k.a #Pushpa meets #Akhanda at Pre-Release Roar 🦁💥
📍Shilpakala Vedika | 27th Nov @ 6:30PM#AkhandaRoaringFrom2ndDec#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth pic.twitter.com/Wv39bZqCwo
— Dwaraka Creations (@dwarakacreation) November 25, 2021
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























