స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే స్టార్ హీరోస్ తో జంటగా నటించి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పూజాహెగ్డే బిగ్ బీ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇటీవల పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి సెట్స్‌లో సరదాగా చిరునవ్వులు చిందిస్తున్న తన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో తన కలలను పొందుపరుస్తూ ఓ జాబితాను సిద్ధంచేసుకున్నాననీ , వాటిలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్‌బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది మొదటిదనీ , ఆయనతో తెరను పంచుకునే రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాననీ , ఆ కల నెరవేరడం ఆనందంగా ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































