మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే కదా. దాదాపు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో ఉండి సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవలే తాజాగా మెగా హీరోలందరితో కలిసి దీపావళి పండుగ రోజు సాయి తేజ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇక తాజాగా సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇచ్చి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ వాయిస్ మెసేజ్ లో ”హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిశాక నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. ‘రిపబ్లిక్’ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. ‘జీ 5’ ఓటీటీలో నవంబర్ 26న ఈ సినిమా విడుదలవుతోంది. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. జై హింద్’’ అని ఆయన అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























