క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా వల్ల ఆగిపోయింది. అయితే మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకున్న తరుణంలో కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మరింత ఆలస్యం అయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 10:08 గంటలకు ఉండనుంది అని హీరో అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరి ఎప్పటినుండో ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని అంటున్నారు. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ అప్ డేట్ ఇస్తారా.. లేక వేరే ఏదైనా ఉంటుందా అసలు అప్ డేట్ ఏమై ఉంటుందో అన్నది తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే.
Lately, I have been asked ONE question a lot. It shall be answered tomorrow 🔥
MAJOR announcement
on NOV 3rd at 10:08 AM #MajorTheFilm @saieemmanjrekar #SobhitaDhulipala @sonypicsfilmsin @sonypicsindia @GMBents @AplusSMovies @SashiTikka @prakashraaj #Revathi @murlisharma72 pic.twitter.com/iQWNWuFgPK
— Adivi Sesh (@AdiviSesh) November 2, 2021
కాగా 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























