స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి, తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకుల్ తన ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే రకుల్ తనను తాను చురుకుగా, స్లిమ్‌గా ఉంచుకునేందుకు తరచూ జిమ్‌లో వర్కవుట్స్ చేయడమే కాకుండా యోగాసనాలు కూడా వేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను మోటివేట్ చేస్తున్నారు. తాజాగా రకుల్ శుక్రవారం ఉదయం కొత్త యోగా స్టిల్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.సెలబ్రిటీ యోగా ట్రైనర్ అన్షుకా పర్యవేక్షణలో యోగా వీల్‌పై శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆసనం వేశారు. ఆ యోగాసనం అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























