వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సూర్య. గత ఏడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మరోసారి జై భీమ్ లాంటి మరో వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జ్ఞానవేల్ రచన, దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
An intriguing journey of courage, determination, and fearlessness awaits you.
Tamil Trailer: https://t.co/FAhObkvA10
Telugu Trailer: https://t.co/pPSea3IqGhWatch #JaiBhimOnPrime, Nov. 2. @PrimeVideoIN@Suriya_offl #Jyotika @tjgnan @prakashraaj @RSeanRoldan @rajsekarpandian
— 2D Entertainment (@2D_ENTPVTLTD) October 22, 2021
కాగా ప్రొడక్షన్ బ్యానర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు. రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. సంగీతం సీన్ రోల్డాన్, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కధీర్ అందిస్తున్నారు. మరి ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























