మెగా పవర్ స్టార్ చరణ్ కూడా స్పీడ్ పెంచాడు. గత మూడేళ్లుగా ఒకే సినిమాకు కమిట్ అయిన చరణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక త్వరలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 15వ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్ చరణ్. గత కొంతకాలంగా రామ్ చరణ్-గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. దసరా సందర్భంగా తన 16వ చిత్రం గురించి రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు. యు.వి.క్రియేషన్స్, ఎన్వి.ఆర్ సినిమా పతాకాలపై సినిమా రూపొందనుంది.
అయితే వీటితో పాటు ప్రశాంత్ నీల్ తో కూడా చరణ్ సినిమా కమిట్ అయినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ప్రశాంత్‌నీల్, రామ్‌చరణ్, మెగాస్టార్ చిరంజీవిని దసరా పండుగ రోజు కలవడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. వారిని కలిసిన ఫొటోలను ప్రశాంత్ నీల్.. తమ తమ ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. మరి రామ్ చరణ్ తో కూడా సినిమా ఉంటుందని ఎప్పుటినుండో వార్తలు వస్తున్నాయి. అటు ప్రశాంత్ నీల్, ఇటు రామ్ చరణ్ ప్రస్తుతం తమ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి ఆ తరువాత వీరి సినిమాను స్టార్ట్ చేస్తారేమో చూడాలి.
Met a legend, and another in the making. Thank you @AlwaysRamCharan for hosting us, had a wonderful evening. Meeting chireenjavi garu @KChiruTweets was a childhood dream come true!@DVVMovies pic.twitter.com/9MXSvcnX29
— Prashanth Neel (@prashanth_neel) October 15, 2021
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కె.జి.యఫ్ 2 రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా ఎన్టీఆర్ తో ఇటీవలే ఒక సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇంకా బన్నీతో కూడా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: