గత రెండేళ్లలో టాలీవుడ్ కు సంబంధించిన ఎంతో మంది ప్రముఖులను పొగొట్టుకున్నాం. కొంతమంది అనారోగ్య సమస్యలతో మృతిచెందితే.. మరికొంత మంది మాత్రం కరోనా వల్ల మరణించారు. ఇక ఇప్పటికే ఎంతోమందిని పోగొట్టుకోగా తాజాగా మరో ప్రముఖ నిర్మాత మృతిచెందారు. టాలీవుడ్ సినీ నిర్మాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంకట్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని తన సంతాపాన్ని తెలియచేశారు. నా మొదటి సినిమా డాన్ శీను సినిమాకు నిర్మాత..చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత.. నన్ను చాలా ప్రోత్సాహించేవారు అని చెబుతూ ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.
Rest in peace #RRVenkat Garu ..my debut film Donseenu producer ..very passionate film maker,encouraged me a lot ..my deepest condolences to his family 🙏🙏🙏heartbreaking pic.twitter.com/OTdi9EHtCh
— Gopichandh Malineni (@megopichand) September 27, 2021
కాగా వెంకట్ పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆర్.ఆర్ బ్యానర్స్‌పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్మెన్, ఢమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘డైవర్స్ ఇన్విటేషన్’ అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. 2011లో కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























