అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ముందు కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడినా ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంకా ఆలస్యం అయింది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ లు వాయిదా పడగా.. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా నరేశ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: