శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్అయ్యి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సక్సెస్ సంతోషాన్ని లవ్ స్టోరి టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం మీడియాతో సంతోషాన్ని పంచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ… “లవ్ స్టోరీ ” చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల అడ్రస్ చేసిన ఇష్యూస్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారనీ , .ఆ అంశాలన్నింటినీ సినిమా చూసిన వాళ్లు ప్రశంసిస్తున్నారనీ ,ప్రేక్షకులకి, చిత్రానికి పనిచేసిన టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ అన్నారు.హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ.. “లవ్ స్టోరీ”సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ కోరుకున్నారనీ , అందరికీ థ్యాంక్స్ అనీ , సొసైటీకి ఉపయోగపడే పాయింట్స్‌ను టచ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములగారిని అభినందించాలనీ అన్నారు. నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. చిత్ర సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నామనీ , సినిమా బాగుందంటూ ప్రతి థియేటర్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయనీ , సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో భారీగా రిలీజైన సినిమా మాదేననీ , ఇంత గ్రాండ్ రిలీజ్ కు మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలనీ, దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, సాయి పల్లవి.. ఇలా ఈ టీమ్ తో మాకు మంచి బాండింగ్ ఉందనీ , మా అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుందనీ చెప్పారు. మరో నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. చిత్ర సక్సెస్ గురించి ఇవాళ ప్రేక్షకులే మాట్లాడుతున్నారనీ , మేము మాట్లాడాల్సింది ఏమీ లేదనీ , ఇదే కాంబినేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ములగారు నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాననీ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: