పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని, పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. “నాలో “, శంభో శివశంభో “, “జెండాపై కపిరాజు “మూవీస్ తో సముద్రఖని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “అల .. వైకుంఠపురము లో ..”,”క్రాక్” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్రఖని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సముద్రఖని ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, సర్కారు వారి పాట” తెలుగు మూవీస్ తో పాటు 6 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. సముద్ర ఖని విలన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్, కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందనీ , విలన్ గా సముద్ర ఖని నటించనున్నారనీ , ఈ మూవీ లో సముద్ర ఖని ద్విపాత్రాభినయం చేయనున్నారనీ సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: