“ఆవకాయ్ బిర్యానీ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బిందు మాధవి , “పొక్కిషం”మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు.”బంపర్ ఆఫర్ “, “పిల్ల జమీందార్ ” (2011 ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన బిందుమాధవి కోలీవుడ్ లో బిజీగా మారారు. 10 సంవత్సరాల తరువాత బిందు మాధవి ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరస్వతి క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకురాలు శ్రీ చైతు దర్శకత్వం లో ” సినిమాబండి”మూవీ ఫేమ్ వికాస్ వశిష్ట , బిందు మాధవి జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ గాయని సునీత క్లాప్‌నివ్వగా, చిత్ర నిర్మాత అన్నదాత భాస్కరరావు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామనీ , ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందనీ , యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయనీ చిత్ర యూనిట్ తెలిపింది. పూజా రామచంద్రన్, సమీర్, మధుమణి, సనా, జబర్దస్త్ రాజమౌళి, బాహుబలి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: