టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. ” శాకుంతలం” మూవీ లో శకుంతలగా నటించినందుకు సమంత ఆనందం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో హాలీడే ట్రిప్ కు గోవా వెళ్ళారు.గోవా ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత గత కొద్దిరోజులుగా గోవా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే సమంత వర్కౌట్స్ , యోగా చేస్తూ ఫిట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ వీడియోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న సమంత తాజాగా తన ఫిట్ అండ్ ఫ్యాబ్ యాబ్స్ ని చూపిస్తూ నలుపు ప్యాంట్ , స్పోర్ట్స్ బ్రా ధరించిన ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































