ఆది పినిశెట్టి గురించి.. తన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా పోస్టర్ ను బట్టి ఆది ఈసినిమాలో స్ప్రింటర్‌గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.
The true test of a champion is not whether he can triumph, but whether he can overcome obstacles!
Thank you @Karthi_Offl & @arya_offl for launching the #ClapTeaser in Tamil 🤗https://t.co/2TzU2iOjsi
— Aadhi🎭 (@AadhiOfficial) September 6, 2021
ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, రాందాసు తదితరులు నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























