ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా రిలీజ్ కూడా ఎన్నో బ్రేకులు పడగా ఫైనల్ గా ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నిన్న సాయంత్రం తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సినిమా రంగంలో ఉన్నప్పుడు ఏమో కానీ.. రాజకీయ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరువాత జయలలిత చాలా సింపుల్ గా ఉండేదన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు కొంతకాలం తరువాత ఒకే రకమైన చీరలు మాత్రమే కట్టుకునేది. అందుకే ఈసినిమాలో కూడా మేకర్స్ స్పెషల్ గా కంగనా కోసం అలాంటి చీరలనే చేయించారు. సినిమాతో పాటు మరికొన్ని చీరలు ప్రత్యేకంగా తయారుచేయించి పవర్ ఫుల్ మహిళలుగా పలువురికి స్ఫూర్తినిస్తున్న వారికి స్పెషల్ గా ఈ చీరలు ఇస్తున్నారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా మొదటి ప్లేస్ ను దక్కించుకుంది. తలైవి టీమ్ సమంత కు కూడా ఒక చీరను గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. కాాగా సమంత కూడా గతంలో కంగనాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈసినిమా చూడటానికి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.
ఇక ఈ సినిమాలో కంగనాతో పాటు అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: