సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసారి గోపిచంద్ ఖచ్చితంగా హిట్ కొడతాడు అన్న అభిప్రాయానికి వచ్చారు అందరూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ ను మెగాస్టార్ కు చూపించాడు దర్శకుడు సంపత్ నంది. ఇక ట్రైలర్ చూసిన చిరు సంపత్ నంది, చిత్ర యూనిట్ ను అభినందిస్తూ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. సంపత్ నంది రచ్చ సినిమా టైమ్ నుండి నాకు తెలుసు.. మంచి డైరెక్టర్.. కథను చక్కగా చూపించగలిగే డైరెక్టర్.. అది చూసే చరణ్ తో రచ్చ సినిమా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రామీణ క్రీడా కబడ్డీ నేపథ్యం లో సినిమాతో వస్తున్నాడు.. ఈసినిమా కూడా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అన్నారు.
కాగా ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గోపీచంద్, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. మరో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కూడా నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం.. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈసినిమాతో అయినా హిట్ అందుకుంటాడేమో చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























