పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అందాల నటుడు హరనాథ్ పౌరాణిక పాత్రలలో కూడా తనదైన ముద్ర వేశారు. రొమాంటిక్ హీరోగా హరనాథ్ ని అభిమానించే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆయన నటనను , నడకను వాళ్లు ఎంతగానో ఇష్టపడేవారు.ఇప్పటికీ చాలామంది అభిమానులు హరనాథ్ ను మరిచిపోలేదు. ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరూ ఎందుకు ఇండస్ట్రీకి రాలేదని అనుకునేవారు ఉన్నారు. ఇప్పుడు హరనాథ్ తమ్ముడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వందన మూవీస్ బ్యానర్ పై దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వంలో విరాట్ రాజ్ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” మూవీ తెరకెక్కుతుంది . రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ అంశాలు కూడా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. విరాట్ రాజ్ బర్త్ డే సందర్భంగా “సీతామనోహర శ్రీరాఘవ” మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































