ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇటీవల ఉక్రెయిన్ లో చేసిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా మొత్తం పూర్తయింది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని.. ఒకటి రెండు షాట్స్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాదు.. మిగిలిన అప్ డేట్స్ ను త్వరలోనే ఇస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
And thats a wrap! 🤟🏻
Except a couple of pickup shots, we are officially done with the entire shoot of #RRRMovie. Incidentally finished with the same bike shot that we started with on November 19th 2018. pic.twitter.com/lfXErpTbSS— RRR Movie (@RRRMovie) August 26, 2021
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన దోస్తీ సాంగ్ కూడా అలరిస్తుంది. ఇక అక్టోబర్ లో విజయదశమి కానుకగా విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించినా అది కష్టమనే అనిపిస్తుంది. వచ్చే ఏడాదే ఈసినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు.
కాగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























