యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కిన పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ కు ఆ సినిమా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో ఇప్పుడు మరో సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఓ లవ్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు అశోకవనంలో అర్జున కళ్యాణం అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాడు విశ్వక్ సేన్. ఇన్ని రోజులు కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు ఆటంకం రాగా ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక సెట్స్ లో పిక్ ను తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేస్తూ ఈవిషయాన్ని తెలియచేశాడు.
కాగా ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ ను మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: