హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో 1970 ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “సలార్ “ మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “సలార్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న శృతి హాసన్ ఆ మూవీ షూట్ పై అప్ డేట్ ఇచ్చారు. “సలార్ “మూవీ షూటింగ్ శరవేగం గా జరుగుతుందనీ , ఒక బెస్ట్ టీమ్ లో ఇటువంటి వండర్ ఫుల్ ప్రాజెక్ట్ లో తాను కూడా భాగం కావడం ఒక బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నాననీ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ శృతి చెప్పారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































