ఈమధ్య హీరోలు సినిమాల్లో నటించడమే కాదు సొంత ప్రొడక్షన్ హౌస్ లను స్టార్ట్ చేసి వారి సినిమాలను వారే నిర్మించుకుంటున్నారు. అంతేకాదు తక్కువ బడ్జెట్ లో వేరే హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు హీరోలు ఆ రూట్ లో వెళుతుండగా.. ఇప్పుడు యంగ్ హీరో కూడా ఆలిస్ట్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ఒక పక్కసినిమాలు చేస్తూనే మరోపక్క సినిమాలను నిర్మిస్తున్నాడు. దీనిలో భాగంగానే.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా వివాహ భోజనంబు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అందులోనూ కరోనా నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆద్యంతం కామెడీ నేపథ్యంలో సాగిన ఈట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
In collaboration with @AnandiArtsOffl & @SoldiersFactory …
Directed by our Man@RamAbbaraju https://t.co/LghmoIgR05@SonyLIV #Satya @aarzavee @sinish_s @AniVee13 @ChotaKPrasad @SonyMusicSouth @sivacherry9 @seethu77in @dancersatz @001Danish @madhurasreedhar @Dhananjayang pic.twitter.com/PaGh7aDWxm
— Sundeep Kishan (@sundeepkishan) August 4, 2021
కాగా ఈసినిమాలో అర్జావీ రాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా… సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, టి.ఎన్.ఆర్, వైవా హర్ష, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్ కిషన్, శినీష్, కిరణ్ నిర్మిస్తున్నారు. అనివీ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు… మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































