దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ఈసినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండంగా ఈసినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా నటిస్తుండటం విశేషం. తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు ఇప్పుడు మొదటిసారి ఈసినిమాతో నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆయన ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు . దర్శకధీరుడు రాజమౌళి ఈ వీడియోను రిలీజ్ చేశాడు. స్టైలిష్గా గాగుల్స్ పెట్టుకొని.. వాలీబాల్ ఆడుతూ ఉన్న ఆయన ఇంట్రడక్షన్ వీడియో మాత్రం అదిరిపోయింది. ఈ మూవీలో వశిష్ఠ పాత్రలో కనిపించనున్నారు రాఘవేంద్రరావు. మరి ఈసినిమాలో దర్శకేంద్రుడు ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో తెలియాలి.
After directing over 100 films, our Mounamuni comes in front of the camera.. Here’s the first look of @Ragavendraraoba garu as an actor, with #PelliSandaD. https://t.co/JZtORcdd0a#Roshann #SreeLeela @mmkeeravaani #GowriRonanki @arkamediaworks @Shobu_
— rajamouli ss (@ssrajamouli) July 30, 2021
కాగా ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈమూవీ రూపొందుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: