రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు శిరీష్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. అంతేకాదు.. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాబు, ధీరజ్ మోగిలినేని సహా నిర్మాతలు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























