ప్రభాస్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు సలార్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ మధ్యే ప్రభాస్ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం అమితాబ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక తన షూటింగ్ పూర్తయ్యేవరకు అమితాబ్ హైద్రాబాద్ లోనే ఉండనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను ముందు ఇతర నటీనటులతో చిత్రీకరించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కోసం ప్రభాస్ 200రోజులు కేటాయించినట్టు తెలుస్తుంది. మరి అది ఎప్పుడు అన్నది చూడాలి.ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ సలార్, ఆదిపురుష్ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో ఈసినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. మరి ఈసినిమాలతో పాటే అది చేస్తాడా లేక ఆరెండు సినిమాల తరువాత ఈసినిమాను స్టార్ట్ చేస్తాడా లేక ఆసినిమాలు చివరిదశకు వచ్చిన తరువాత చేస్తాడా అన్నది చూడాలి.
అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























