పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బాలీవుడ్ లో రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ధనుష్ నటించిన “అత్రాంగి రే “మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో ధనుష్ ప్రస్తుతం “మారన్ “తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ కి హీరో ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ తో ధనుష్ టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందనున్న ఒక మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ మూవీస్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేశారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా వున్న పూజాహెగ్డే కథానాయికగా నటించే అవకాశం ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెరకెక్కిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























