కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్ క్యారెక్టర్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇంకా ఈసినిమాలో వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























