“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ కు “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు తాప్సీ పన్ను పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో “పింక్”, “బద్లా”, “థప్పడ్”, “నామ్ షబానా”, “సాండ్ కీ ఆంఖ్”, “మిషన్ మంగళ్” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను అలరించారు.తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. “కే 13” మూవీ ఫేమ్ భరత్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును సంపాదించుకున్న తాప్సీ ఇప్పుడు ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అవుట్‌సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభిచారు . తొలి ప్రయత్నంగా అజయ్‌భల్ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని జీస్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నానని చెప్పారు. తాప్సీ మాట్లాడుతూ .. చిత్ర పరిశ్రమలో పదేళ్లుగా నా ప్రయాణం సాగుతోందనీ , .ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తానని ఎప్పుడూ అనుకోలేదనీ , చిత్రసీమకు ఏదైనా తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందనీ, అందుకే నిర్మాతగా మారుతున్నాననీ , నటనతో పాటు ఇకపై నిర్మాతగా కూడా ప్రయాణం సాగిస్తాననీ , అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలనీ తాప్సీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























