అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది.దీంతో సినిమాపై ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈసినిమాలో బన్నీ డీగ్లామర్ లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ స్టైలిష్ లుక్ లో, కాస్త మాస్ లుక్ లో కనిపించిన బన్నీని సుకుమార్ ఈసినిమాలో ఊరమాస్ గా చూపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో పడింది. అయితే ఈసినిమా షూటింగ్ లో ఫహద్ ఫాజిల్ ఇంత వరకూ పాల్గొనలేదు. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్..ఇంత వరకూ షూటింగ్ లో పాల్గొనలేదని.. పుష్ప సినిమాషూటింగ్ కోసం ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నానని.. త్వరలోనే టీమ్ తో కలవనున్నానని తెలిపాడు. అంతేకాదు సుకుమార్ సినిమాలు ఇంతకుముందు చూశాను.. ఈసినిమాలో అవకాశం రావడం హ్యాపీగా ఉందని తెలిపాడు.
మరి ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇంకా కొంచం పెండింగ్ వర్క్ ఉండగా దాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. డిసెంబర్ కు ఫస్ట్ పార్ట్ ను రిలీజే చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి డిసెంబర్ లో రిలీజ్ చేస్తారో.. అంతకంటే ముందే రిలీజ్ చేస్తారో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























