టాలీవుడ్ గురించి కూడా ఆలోచించండి..!

Tollywood Ace Writer Kona Venkat Suggests Government To Start An OTT Of Its Own Citing Kerala As An Example,Telugu Filmnagar,Tollywood Movie Updates,Kona Venkat,Kona Venkat Movies,Kona Venkat New Movie,Kona Venkat Latest Movie,Kona Venkat News,Kona Venkat Latest News,Kona Venkat Movie Updates,Kona Venkat Movie News,Kona Venkat Applauds Kerala Government,Kerala Government,Kona Venkat Applauds Kerala Government’s OTT Initiative,Producer Kona Venkat,OTT Platform,Kona Venkat Applauds Mollywood’s OTT Initiative,Kona Venkat Applauds Mollywood OTT Initiative,Kerala Government,Kerala Government To Float An OTT Platform,Tollywood Writer And Producer Kona Venkat,Kerala Government To Kickstart An OTT Platform,Kerala Government To Start An OTT Platform,Kerala Government’s OTT Initiative,Kerala Government OTT Initiative,Kerala Govt To Launch New OTT Platform For Malayalam Films,Malayalam Films,Kerala Govt New OTT Platform,Kona Venkat About Kerala OTT Platform,New OTT Platform For Malayalam Films,Kona Venkat Suggests Government To Start An OTT,Kerala Govt To Launch OTT Platform,Kona Venkat Suggests Government

కరోనా వల్ల సినీ పరిశ్రమకు ఎంత నష్టం కలిగిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది కరోనా వల్ల ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్స్ కూడా మూత పడటంతో..సినిమా రిలీజ్ లు అన్ని ఆగిపోవడంతో. ఎలాగోలా ఈ ఏడాది రిలీజ్ చేసుకున్నారు. ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి చాలానే ఉన్నాయి. ఈలోపే మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు చిన్నసినిమాలు అన్ని ఆగిపోవడంతో వేల కోట్లలోనే నష్టం ఏర్పడింది. పెద్ద సినిమాలు అంటే లేట్ అయినా ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. కానీ చిన్న సినిమాల పరిస్థితి వేరు. అందుకే థియేటర్లు లేవు కాబట్టి ఓటీటీలోనే రిలీజ్ చేసుకుంటున్నారు. ఏదో కొన్ని సినిమాలకు తప్పా దీనివల్ల మేకర్స్ కు కూడా నష్టమే కలుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా ఓటీటీ వేదికలు ఉన్నా కేరళ ప్రభుత్వం మాత్రం మ‌రో ముంద‌డుగు వేసింది. ప్ర‌భుత్వమే.. ఓ ఓటీటీ సంస్థ‌ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. చిన్న సినిమాల‌కు ఈ వేదిక ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని కేర‌ళ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. మాలీవుడ్ నుంచి యేడాదికి దాదాపు 100 సినిమాలువ‌స్తున్నాయి. వాటిలో చిన్న సినిమాల‌దే అగ్ర పీఠం. అయితే వాటిలో చాలా వ‌ర‌కూ విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. ఈ సమ‌స్య‌ని ప‌రిష్క‌రించడానికే ఓటీటీ సంస్థ‌ని నిర్మిస్తున్న‌ట్టు కేర‌ళ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇక దీనిపై కోన వెంకట్ కూడా స్పందిస్తూ ‘‘చిన్న చిత్రాలను ప్రోత్సహించడానికి సొంతంగా ఒక ఓటీటీ వేదికను ప్రారంభించడానికి కేరళ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. నా దృష్టిలో ఇదొక గొప్ప అంకురార్పణ. దయచేసి… తెలుగు చిత్ర పరిశ్రమకు సహాయం చేయడానికి ఆ విధంగా ఆలోచించే ప్రయత్నం చేయండి’’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ట్యాగ్ చేస్తూ కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు. చూద్దాం మరి కేరళ ప్రభుత్వం నిర్ణయంతో మనవాళ్లు కూడా ఏదైనా కొత్త మార్గంతో వస్తారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =