తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచమైన కాజల్ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదిహేనేళ్లు పైన అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గానే దూసుకుపోతుంది. ఇక కాజల్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఖైదీ నెం.150 సినిమారాగా ఇది రెండో సినిమా. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. అయితే నేడు కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి కాజల్ కు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈ ఫొటోలో కాజల్ లంగా ఓణీలో ట్రెడీషనల్ గా ఉండగా.. ఈ ఫొటో అందర్నీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #Acharya wishes the gorgeous & supremely talented @MsKajalAggarwal a very Happy Birthday ❤️#HappyBirthdayKajal
Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @hegdepooja #ManiSharma @ramjowrites @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @KonidelaPro pic.twitter.com/vg0UZq1XCH
— Matinee Entertainment (@MatineeEnt) June 19, 2021
కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. పూజా హెగ్డే మరో హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈసినిమా తో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తుంది కాజల్. ప్రవీణ్ సత్తారు నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: