మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి ” మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా విడుదల వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకోగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామనీ , “ఖిలాడి ” మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందనీ మేకర్స్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ హీరోగా ఒక మూవీ తెరకెక్క నున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఒక కథానాయికగా ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌ను ఎంపిక చేశారు. మరో నాయిక పాత్రకు సూపర్ హిట్ తమిళ మూవీ “కర్ణన్” ఫేమ్ రజిషా విజయన్ పేరు పరిశీలనలో ఉంది. “ఖైదీ”, “అర్జున్ సురవరం ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ సంగీత దర్శకుడు
సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరత్ మండవ, సామ్ సిఎస్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ తరువాత చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆలోపు పాటల పని పూర్తి చేయాలని దర్శకుడు శరత్ మండవ ప్లాన్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























