క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ మూవీ లో తన అందం, అభినయం తో లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా రూపొందిన “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠి మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవీంద్ర మాధవ దర్శకత్వంలో అథర్వ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ తమిళ మూవీ లో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వర్కౌట్స్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే లావణ్య తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తూ మీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అదే చేయండని అంటూ తన సెల్ఫీలను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ సెల్ఫీలు అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























